ఆనందంతో నవ్వులు చిందిస్తున్న రేణూ దేశాయ్ వీడియో.. త్వరలో ఓ విషయం చెబుతానని పోస్ట్!
- ఆమె పక్కనే కూతురు ఆద్య డ్యాన్స్
- ‘నేను ఇలా ఎందుకు నవ్వుతున్నానో తెలుసుకోవాలంటే వేచి చూడండి’ అని వ్యాఖ్య
- ఓ లవ్ సాంగ్నూ వినిపించిన రేణూ
‘నేను ఇలా ఎందుకు నవ్వుతున్నానో తెలుసుకోవాలంటే వేచి చూడండి’ అని ఆమె పేర్కొంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఓ సినిమాలోని ఓ పాటను ఆమె ఈ సందర్భంగా వినిపించింది.
‘ఎంత మంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా. నిన్న గాక మొన్న వచ్చి ఏ మాయ చేసావె పిల్లిమొగ్గలేసిందిలా.. గాలుల్లో నీ వాసన...’ అనే పాటను ఈ వీడియోలో వినొచ్చు. దీంతో ఆమె చెప్పబోయే విషయం ఏంటనే విషయంపై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.