బాలకృష్ణ కోసం కథను సిద్ధం చేసిన మాస్ చిత్రాల దర్శకుడు
- ప్రస్తుతం బోయపాటితో బాలకృష్ణ సినిమా
- ఇంకా ఖరారు కాని బాలయ్య తదుపరి చిత్రం
- కథ రెడీ చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని
- మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మాణం?
ఇక దీని తర్వాత బాలయ్య చేసే సినిమా ఏమిటి? అన్నది ఇంకా వెల్లడికాలేదు. గత కొంతకాలంగా ఆయన ఆయా దర్శకులు చెబుతున్న కొత్త కథలు వింటున్నప్పటికీ, ఇంకా ఏదీ ఖరారు కాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో బాలకృష్ణ కోసం మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ సబ్జెక్టును తయారుచేసినట్టు సమాచారం.
ఇప్పటికే ఆయన ఈ కథను ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారికి చెప్పినట్టు, వారికి బాగా నచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో బాలయ్యకు ఆ కథను వినిపించడానికి వీరు సమాయత్తమవుతున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే భారీ బడ్జెట్టుతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేసున్నారు.