పవన్ కల్యాణ్ ఫోటోను షేర్ చేసిన రేణు దేశాయ్
- మరాఠి సినిమాల్లో బిజీగా ఉన్న రేణు దేశాయ్
- పిల్లలతో పవన్ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన రేణు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
తాజాగా రేణు ఒక అద్భుతమైన ఫొటోను షేర్ చేశారు. పవన్ కల్యాణ్ తన కుమారుడు, కుమార్తెను ఒళ్లో పడుకోబెట్టుకుని ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేయాల్సిన అవసరం ఉందని ఆమె కామెంట్ పెట్టారు. కొన్ని అరుదైన ఫొటోలను తాను ఫోన్ కెమెరాతో తీశానని చెప్పారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలపై నెటిజెన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.