షూటింగ్ లొకేషన్లో హాయిగా నిద్రపోయిన హీరోయిన్ కీర్తి సురేశ్.. మెల్లిగా సెల్ఫీ దిగిన హీరో నితిన్!
- తాము చెమటలు కారుస్తుంటే కీర్తి సురేశ్ పడుకుందన్న నితిన్
- తాను కూడా తప్పకుండా రివేంజ్ తీర్చుకుంటానన్న కీర్తి
- షూటింగ్ మధ్యలో నిద్రపోకూడదనే పాఠం నేర్చుకున్నానని వ్యాఖ్య
తాము ఓపక్క చెమటలు కారుస్తుంటే.. కీర్తి సురేశ్ మాత్రం హాయిగా పడుకుందని నితిన్ ఆ ఫొటోను షేర్ చేస్తూ, కామెంట్ చేశాడు. ఇదే ఫొటోను కీర్తి సురేశ్ కూడా పోస్ట్ చేస్తూ.. తాను కూడా నితిన్, వెంకీ అట్లూరీపై తప్పకుండా రివేంజ్ తీర్చుకుంటానని, అయితే, ఇక షూటింగ్ మధ్యలో ఎప్పుడూ నిద్రపోకూడదనే పాఠం నేర్చుకున్నానని సరదాగా పేర్కొంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.