సుజిత్ దర్శకత్వంలో గోపీచంద్ తదుపరి సినిమా?
- 'సీటీమార్' చిత్రంలో నటిస్తున్న గోపీచంద్
- హైదరాబాదులో తాజా షెడ్యూలు షూటింగ్
- 'సాహో' ఫేమ్ సుజిత్ తో సంప్రదింపులు
ప్రభాస్ తో చేసిన 'సాహో' సినిమా విజయం సాధించనప్పటికీ, యాక్షన్ దృశ్యాల చిత్రీకరణ రీత్యా దర్శకుడు సుజిత్ కి అది మంచి పేరుతెచ్చింది. ఈ చిత్రం తర్వాత ఆయన చిరంజీవితో 'లూసిఫర్' రీమేక్ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు. అలాగే ఇటీవల 'ఛత్రపతి' సినిమా హిందీ రీమేక్ కి కూడా ఆయన పేరు వినిపించినా, దానిని సుజిత్ ఖండించాడు.
ఈ క్రమంలో గోపీచంద్ తో సుజిత్ సినిమా దాదాపు ఓకే అయినట్టు, దీనిని ఓ ప్రముఖ సంస్థ నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుందట.