మళ్లీ హీరోగా అవకాశం.. ఆలోచిస్తున్న సునీల్!
- గతంలో ఓసారి హీరోగా మారిన సునీల్
- సక్సెస్ కాలేకపోయిన హాస్య నటుడు
- 'బెల్ బాటమ్' రీమేక్ లో హీరోగా అవకాశం
ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ ఇతనికి హీరోగా ఓ అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. గత ఏడాది కన్నడలో వచ్చిన 'బెల్ బాటమ్' చిత్రం హిట్టయింది. రిషబ్ శెట్టి, హరిప్రియ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో కథానాయకుడి పాత్రను పోషించాల్సిందిగా కోరుతున్నారట. ఈ విషయంలో సునీల్ ప్రస్తుతం తీవ్రంగా ఆలోచిస్తున్నాడనీ, త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటాడని అంటున్నారు.