పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరోసారి బాలకృష్ణ!
- గతంలో బాలకృష్ణతో పూరి 'పైసా వసూల్'
- బాలయ్యను కొత్త కోణంలో చూపిన చిత్రం
- ప్రస్తుతం బోయపాటితో చేస్తున్న బాలకృష్ణ
- బాలయ్య కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్న పూరి
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ ను చేస్తున్నారు. దీని తర్వాత బాలకృష్ణ చేసే చిత్రం పూరి దర్శకత్వంలోనేనని అంటున్నారు. ఇటీవల తాను ఓ స్టార్ హీరో కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నానని పూరి ప్రకటించాడు. అది బాలయ్య కోసమేనని, ఇప్పటికే బాలయ్య ఈ స్క్రిప్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ 'ఫైటర్' చిత్రాన్ని చేస్తున్నారు. దీని చివరి షెడ్యూలు షూటింగ్ త్వరలో జరుగుతుంది. దీని తర్వాత ఆయన బాలకృష్ణ చిత్రంపైనే వర్క్ చేస్తారని అంటున్నారు. సో.. వచ్చే ఏడాది వీరిద్దరి కలయికలో చిత్రం సెట్స్ కి వెళ్లచ్చు!