నితీశ్ కుమార్ పాదాలను తాకి నమస్కరించిన చిరాగ్!
- ఇటీవల కన్నుమూసిన రామ్ విలాస్ పాశ్వాన్
- నివాళులు అర్పించేందుకు వచ్చిన నితీశ్ కుమార్
- గౌరవ సూచకంగా పాదాలకు నమస్కారం
నితీశ్ కుమార్ అలా వెళ్లగానే, తన పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన చిరాగ్, జేడీయూ నేత దినేశ్ సింగ్ కుమార్తె కోమల్ సింగ్ ను తన పార్టీ తరఫున అభ్యర్థినిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె గైఘాట్ నియోజకవర్గం నుంచి పోటీ పడనుంది. ఈ స్థానంలో జేడీయూ నుంచి తన కుమార్తెను బరిలోకి దించాలని తొలుత భావించిన దినేశ్ సింగ్, ఆ సీటును మహేశ్వర్ యాదవ్ కు పార్టీ కేటాయించడంతోనే చిరాగ్ ను ఆశ్రయించి, ఎల్జేపీ తరఫున కోమల్ సింగ్ ను దింపినట్టు తెలుస్తోంది.