ధోనీ గొప్ప క్రికెటరే.. కానీ, ఆయన వ్యాఖ్యలు సరికాదు: కృష్ణమాచారి శ్రీకాంత్
- కొందరు యువ ఆటగాళ్లలో ఆడాలనే కసి కనిపించలేదన్న ధోనీ
- జాదవ్, పియూష్ చావ్లాలో కనిపించిందా? అని ప్రశ్నించిన శ్రీకాంత్
- స్వయం తప్పిదాలతో చైన్నై ఈ సీజన్ ను ముగిస్తోందని వ్యాఖ్య
ధోనీ వ్యాఖ్యలపై భారత జట్టు మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించారు. ధోనీ మంచి క్రికెటర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని... అయితే మ్యాచ్ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలను ఏమాత్రం సమర్థించనని చెప్పారు. జగదీశన్ లాంటి యువ ఆటగాళ్లలో కనిపించని కసి... కేదార్ జాదవ్, పియూష్ చావ్లాలో కనిపించిందా? అని ప్రశ్నించారు. స్వయం తప్పిదాలతో చెన్నై జట్టు ఈ సీజన్ ను లీగ్ దశలోనే ముగిస్తోందని చెప్పారు.