సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- వరుస షూటింగుల్లో పాల్గొంటున్న తాప్సి
- ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రామ్
- హైదరాబాదులో విశాల్, ఆర్య మల్టీ స్టారర్
* యంగ్ హీరో రామ్ కథానాయకుడుగా 'గరుడవేగా' ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గతంలో ఓ చిత్రం ప్రారంభమై, ఆగిపోయింది. ఇప్పుడీ చిత్రాన్ని తిరిగి ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. స్క్రిప్టుకి దర్శకుడు కొన్ని మార్పులు చేర్పులు చేయడంతో రామ్ తాజాగా దీనికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
* విశాల్, ఆర్య కలసి ఓ చిత్రంలో హీరోలుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ చిత్రం షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఆనంద్ శంకర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.