థియేటర్లలో విడుదలకు రెడీ అవుతున్న రెండు సినిమాలు!
- ఈ నెల 15 నుంచి థియేటర్లకు అనుమతి
- ఏభై శాతం సీటింగ్ తగ్గించి తెరచుకోవచ్చు
- థియేటర్లకు రవితేజ 'క్రాక్', రామ్ 'రెడ్'
ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం ప్రకటించిన అన్ లాక్ 5.0 ప్రకారం ఈ నెల 15 నుంచి థియేటర్లను తెరవవచ్చు. ప్రస్తుతమున్న సీటింగ్ కెపాసిటీలో ఏభై శాతం తగ్గించి, పూర్తి కొవిడ్ నిబంధనలతో థియేటర్లను తెరచుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో చిత్ర పరిశ్రమలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ముఖ్యంగా విడుదలకు రెడీగా వున్న చిత్రాల నిర్మాతలు, ఆయా చిత్రాల హీరోలు హ్యాపీగా ఈ పరిణామాన్ని స్వాగతిస్తున్నారు.
ఈ క్రమంలో ముందుగా తెలుగులో రెండు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటిలో ఒకటి రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన 'క్రాక్' చిత్రం కాగా.. మరొకటి రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన 'రెడ్' సినిమా. ఈ రెండూ కూడా కాస్త గ్యాప్ తో ఒక దాని తర్వాత ఒకటి వచ్చే నెల ప్రారంభంలో విడుదల కానున్నాయని తెలుస్తోంది.