నయనతార పాత్రలో జాన్వీ కపూర్?
- నయనతార నాయికగా 'కొలమావు కోకిల'
- 'కోకో కోకిల'గా తెలుగులోకి అనువాదం
- హిందీలోకి రీమేక్ చేసే ప్రయత్నాలు
ఈ క్రమంలో ఆమధ్య నయనతార నటించిన ఓ చిత్రాన్ని కూడా ఇప్పుడు బాలీవుడ్ లో పునర్నిర్మిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నయనతార కథానాయికగా వచ్చిన 'కొలమావు కోకిల' చిత్రం మంచి హిట్టయింది. ఈ చిత్రాన్ని 'కోకో కోకిల' పేరిట తెలుగులోకి కూడా అనువదించి రిలీజ్ చేశారు. ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక నయనతార పాత్రను హిందీ వెర్షన్లో జాన్వీ కపూర్ పోషించనున్నట్టు సమాచారం. 'కొలమావు కోకిల'లో నయనతార పాత్ర పెర్ఫార్మెన్స్ తో కూడిన పాత్ర. ఆమెకు ఎంతో పేరు కూడా తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో ఎదుగుతున్న జాన్వీకి కెరీర్ పరంగా ఇది ఎంతో హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు.