కరోనా ఎఫెక్ట్.. 'కార్తికేయ2' చిత్రంలో హీరోయిన్ మార్పు!
- నిఖిల్ హీరోగా 'కార్తికేయ2' చిత్రం
- తొలుత హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ఎంపిక
- ఆమె స్థానంలో ప్రియాంక అరుల్ కు ఛాన్స్
ఇదిలావుంచితే, నిఖిల్ హీరోగా గతంలో వచ్చిన 'కార్తికేయ' చిత్రం హిట్ అయింది. ఆరేళ్ల తర్వాత దీనికి సీక్వెల్ గా 'కార్తికేయ2'ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ ను సిద్ధంగా ఉంచుకున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.
ఇక తొలుత ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే, చాలా గ్యాప్ రావడంతో ఆమె సైన్ చేసిన ఇతర ప్రాజెక్టులతో బిజీ అయింది. ఈ సినిమా కోసం డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతోందట. దీంతో, ఆమె స్థానంలో ప్రియాంక అరుల్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. నాని చిత్రం 'గ్యాంగ్ లీడర్'లో ప్రియాంక నటించింది.