సోనూ సూద్ కు శాలువా కప్పి సన్మానించిన ప్రకాశ్ రాజ్... వీడియో ఇదిగో!
- లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్ దాతృత్వం
- వలస జీవుల పాలిట దేవుడిలా మారిన సోనూ సూద్
- అల్లుడు అదుర్స్ సెట్స్ పై సోనూను అభినందించిన ప్రకాశ్ రాజ్
కేంద్రం కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ వలస కార్మికులు, పేదల పాలిట తీవ్ర విఘాతంలా పరిణమించింది. ఈ నేపథ్యంలో సోనూ సూద్ బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి వలసజీవులను వారి స్వస్థలాలకు చేర్చారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించారు. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ అపర దానకర్ణుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.