అదరగొట్టిన పవన్ కల్యాణ్ పాట.. 3 కోట్ల వ్యూస్!
- 'వకీల్ సాబ్'లో 'మగువా మగువా' పాట
- మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల
- 6 లక్షల 86 వేల లైక్స్ కూడా
- పవన్ కల్యాణ్ కెరీర్లో సరికొత్త రికార్డు
ఇక ఈ చిత్రంలో 'మగువా.. మగువా' అనే పాటను లిరికల్ సాంగుగా ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఆదిత్యా మ్యూజిక్ కంపెనీ విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రి రాయగా తమన్ సంగీత సారథ్యంలో సిద్ శ్రీరాం ఈ పాటను పాడాడు. ఇప్పుడీ పాట యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. 3 కోట్ల (30 మిలియన్లు) వ్యూస్ ను సొంతం చేసుకుని పవన్ కెరీర్లో రికార్డుగా నిలిచింది. అలాగే ఇది 6 లక్షల 86 వేల లైక్స్ ను కూడా పొందడం మరో విశేషం.
ఆరు నెలల గ్యాప్ అనంతరం ఈ చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాదులో మొదలైంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే నెల నుంచి పవన్ షూటింగులో పాల్గొంటారు. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్, అంజలి, నివేదా థామస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.