హైదరాబాదులో 'వకీల్ సాబ్' షూటింగ్ షురూ!
- ఇప్పటికే చాలా షూటింగ్ జరుపుకున్న 'వకీల్ సాబ్'
- తాజాగా హైదరాబాదు పరిసరాల్లో షూటింగ్ నిర్వహణ
- వచ్చే నెల నుంచి షూటింగులో పవన్ కల్యాణ్
- సంక్రాంతికి విడుదల చేసే ప్రయత్నాలు
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందుతున్న 'వకీల్ సాబ్' చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందే చాలావరకు పూర్తయింది. ఇక మరికొన్ని రోజుల షూటింగ్ మాత్రం మిగిలివుంది. దీంతో ప్రస్తుతం హైదరాబాదు పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రీకరణలో కథానాయిక అంజలి, ఇతర నటీనటులు పాల్గొంటున్నారు.
అయితే, పవన్ కల్యాణ్ మాత్రం వచ్చే నెలలో ఈ సినిమా షూటింగులో జాయిన్ అవుతారని అంటున్నారు. శ్రుతిహాసన్, నివేద థామస్ లు కూడా అప్పుడే షూటింగులో పాల్గొంటారని తెలుస్తోంది. హిందీలో వచ్చిన 'పింక్' చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు, బోనీ కపూర్ కలసి నిర్మిస్తున్నారు. సంక్రాంతికి దీనిని విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.