సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మళ్లీ షూటింగులో పాల్గొంటున్న రకుల్
- పెరుగుతున్న నాని సినిమా బడ్జెట్
- మల్టీ స్టారర్ లో నటిస్తున్న విశాల్
* నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' పేరిట ఓ చిత్రం రూపొందనుంది. కోల్ కతా నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగడం వల్ల అక్కడికి వెళ్లి షూటింగ్ చేయాలని మొదట్లో భావించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల కారణంగా హైదరాబాదులోనే పాత కోల్ కతా వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్స్ ను భారీగా వేస్తున్నారు. దీని వల్ల బడ్జెట్ భారీగా పెరుగుతోందని తెలుస్తోంది.
* తమిళ కథానాయకుడు విశాల్ త్వరలో తన స్నేహితుడు ఆర్యతో కలసి ఓ మల్టీ స్టారర్ చేయనున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తారు.