సమంత తప్పుకుంది.. ఐశ్వర్య రాజేశ్ ఒప్పుకుంది!
- తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఐశ్వర్య
- 'ఆర్ఎక్స్ 100' దర్శకుడి 'మహా సముద్రం'
- హీరోలుగా సిద్ధార్థ్, శర్వానంద్ ఎంపిక
- మొదట్లో సమంతకు వచ్చిన ఆఫర్
'ఆర్ఎక్స్ 100' చిత్రంతో పేరుతెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి తాజాగా 'మహా సముద్రం' పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో మొదట్లో హీరోయిన్ గా సమంతను సంప్రదించగా, పాత్ర నచ్చడంతో చేయడానికి ఒప్పుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే, ఆ తర్వాత ఏవో కారణాలు చెప్పి ఆమె ఆ ప్రాజక్టు నుంచి తప్పుకుందట. దాంతో మరికొందరిని ప్రయత్నించినప్పటికీ, తాజాగా ఆ అవకాశం ఐశ్వర్యకు వచ్చినట్టు తెలుస్తోంది.