షూటింగుకి రెడీ అవుతున్న బాలకృష్ణ .. ఫిలిం సిటీలో ఏర్పాట్లు!
- తారలను వెంటాడుతున్న కరోనా భయం
- ధైర్యంగా ముందుకు వచ్చిన బాలయ్య
- ఈ నెల 14 నుంచి షూటింగ్ నిర్వహణ
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న మూడో చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందు కొంత జరిగింది. దీంతో ఈ నెల 14 నుంచి షూటింగ్ పెట్టుకోమని బాలకృష్ణ నిర్మాతకు చెప్పినట్టు సమాచారం. మనం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ, కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ షూటింగ్ చేద్దామని ఆయన దర్శక నిర్మాతలకు చెప్పారట.
దీంతో ఈ నెల 14 నుంచి హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీలో షూటింగుకి ఏర్పాట్లు చేస్తున్నట్టు చెబుతున్నారు. అక్కడి గ్రామీణ వాతావరణం సెట్లో ముందుగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఇందులో ఓ కొత్త అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేయనున్నారు. త్వరలోనే ఈ చిత్రం టైటిల్ని అధికారికంగా ప్రకటిస్తారు.