'హీరోయిన్ నయనతారతో పెళ్లి' వార్తలపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
- నయనతారతో దర్శకుడు విఘ్నేశ్ ప్రేమాయణం
- ఇప్పట్లో పెళ్లి జరగబోదని స్పష్టం
- ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టి సారించామని వ్యాఖ్య
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నయనతారతో తన వివాహం గురించి అందరూ అడుగుతున్నారని, మరోపక్క త్వరలోనే తాము పెళ్లి చేసుకోబోతున్నామనీ కొందరు ప్రచారం చేస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, ఇందులో నిజం లేదని, తాము ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టి సారించి పనులు చేసుకుంటున్నామని చెప్పాడు.
తాము కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నామని, వివాహం అనంతరం వాటిని అందుకోవడం కంటే ముందే సాధిస్తే బాగుంటుందని తాము భావిస్తున్నామని విఘ్నేశ్ తెలిపాడు. ఈ కారణంగానే తాము వివాహం గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదని చెప్పుకొచ్చాడు.