మూడు వారాల క్రితమే నాకు కరోనా అని తేలింది: జెనీలియా
- 21 రోజులు ఐసొలేషన్ లో ఉన్నా
- తాజా టెస్టులో నెగెటివ్ అని వచ్చింది
- ఇన్ని రోజులు ఐసొలేషన్ లో ఉండటం బాధించింది
కరోనా వల్ల తాను ఎక్కువగా ఇబ్బంది పడకపోయినా... ఇన్ని రోజులు ఐసొలేషన్ లో ఉండటం ఎంతో బాధించిందని ఈ సందర్భంగా జెనీలియా చెప్పింది. ఒంటరిగా గడపడం ఛాలెంజింగ్ గా అనిపించిందని వ్యాఖ్యానించింది. కరోనా నుంచి కోలుకుని కుటుంబసభ్యుల మధ్యకు రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపింది. మన చుట్టూ కావాల్సిన వాళ్లు ఉన్నప్పుడు... అది మనకు ఎంతో బలాన్ని, శక్తిని ఇస్తుందని చెప్పింది. ప్రతి ఒక్కరూ ముందుగానే టెస్టులు చేయించుకోవడం, ఫిట్ గా ఉండటం, మంచి ఆహారం తీసుకోవడం చేస్తే... కరోనాపై విజయం సాధించవచ్చని తెలిపింది.