ప్రజలు కరోనాను ఇంత తేలికగా తీసుకోవద్దు!: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
- భారత్లో రికవరీ రేటు 76.28 శాతం
- మరణాల రేటు ప్రపంచంలోనే అత్యల్పం
- దేశంలో ఇప్పటి వరకు 4 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు
- కరోనా వ్యాప్తి గురించి స్థానిక నాయకులు అవగాహన కల్పించాలి
మధ్యప్రదేశ్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... భారత్లో రికవరీ రేటు 76.28 శాతంగా ఉందని చెప్పారు. మరణాల రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా 1.82 శాతంగా ఉందని వివరించారు. దేశంలో ఇప్పటి వరకు 4 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలు కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం సరికాదని ఆయన చెప్పారు. ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తి గురించి స్థానిక నాయకులందరూ అవగాహన కల్పించాలని ఆయన కోరారు.