విషం ఆనవాళ్లు తెలియకూడదనే సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం ఆలస్యమయ్యేలా చేశారు: సుబ్రహ్మణ్యస్వామి
- సుశాంత్ ది హత్యేనంటున్న స్వామి
- విషప్రయోగం జరిగిందంటూ తాజా ట్వీట్
- హంతకులను కఠినంగా శిక్షించాలని వ్యాఖ్యలు
"హంతకుల దుష్టస్వభావం, వాళ్ల ఉద్దేశం క్రమేపీ బహిర్గతమవుతోంది. సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం ప్రక్రియను కావాలనే ఆలస్యం చేశారు. సుశాంత్ కడుపులోని విషం జీర్ణ రసాల్లో కలిసిపోతే, అప్పుడు ఆ విషం ఆనవాళ్లు ఎవరూ గుర్తించలేరన్న ఆలోచనతోనే పోస్టుమార్టం ఆలస్యం అయ్యేలా చేశారు" అంటూ వివరించారు. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాల్సిన సమయం వచ్చిందని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు.