టీవీ షోలో యాంకర్ అనసూయ భావోద్వేగభరిత వ్యాఖ్యలు
- నన్ను, చెల్లెళ్లను చదవించడానికి అమ్మ చాలా కష్టపడింది
- చీరలకు ఫాల్స్ కుట్టి మమ్మల్ని చదివించాల్సి వచ్చింది
- నా చిన్నప్పుడు అద్దె ఇంట్లో ఉండే వాళ్లం
- రెండు బస్టాప్‌లు నడిచి బస్సు ఎక్కేదాన్ని
ఓ టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆమె ఈ విషయాలను గురించి వివరించింది. తనను, తన చెల్లెళ్లను చదవించడానికి తన తల్లి ఎంతో కష్టపడిందని తెలిపింది. తన తల్లి చీరలకు ఫాల్స్ కుట్టి తమను చదివించాల్సి వచ్చిందని చెప్పింది. తన చిన్నప్పుడు అద్దె ఇంట్లో ఉండే వారిమని, ఒక్కోసారి అద్దె కట్టడం భారమై తక్కువ అద్దెకు దొరికే ఇంట్లోకి మారేవారిమని తెలిపింది. డబ్బు ఆదా చేయడానికి తాను రెండు బస్టాప్‌లు నడిచి బస్సు ఎక్కేదాన్నని చెప్పింది.