నాని 'వి'కి అమెజాన్ భారీ ఆఫర్... ఓకే చెప్పేసిన దిల్ రాజు!
- వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల
- త్వరలో రానున్న అధికారిక ప్రకటన
- ఇంద్రగంటి దర్శకత్వంలో 'వి'
అమెజాన్ ప్రైమ్ నుంచి భారీ ఆఫర్ రాగా, తాజాగా దిల్ రాజు, సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు అంగీకరించారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సెప్టెంబర్ లో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లోకి వస్తుందని, త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. కాగా, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అదితీరావు హైదరీ హీరోయిన్లుగా నటించారు.