నీలకంఠ దర్శకత్వంలో రాజశేఖర్ తాజా చిత్రం
- ఎమోషనల్, యాక్షన్ చిత్రాలలో రాజశేఖర్ ముద్ర
- మళ్లీ 'గరుడవేగ' చిత్రంతో దక్కిన విజయం
- ఉత్తమ చిత్రాల దర్శకుడు నీలకంఠకు గ్రీన్ సిగ్నల్
ఈ క్రమంలో పలు కథలు విన్న మీదట రాజశేఖర్ తాజాగా ఓ చిత్రాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. 'షో', 'మిస్సమ్మ', 'విరోధి' వంటి ఉత్తమ చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు నీలకంఠ చెప్పిన కథ నచ్చడంతో, చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ప్రస్తుతం పూర్తి స్క్రిప్టు పని జరుగుతోందనీ, త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తారని సమాచారం.