సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- తాజా చిత్రంలో హన్సిక కొత్త అవతారం
- డిటెక్టివ్ పాత్ర పోషించనున్న రవితేజ
- 'లాభం' కోసం విజయ్ సేతుపతి డబ్బింగ్
* ప్రస్తుతం 'క్రాక్' సినిమాలో నటిస్తున్న రవితేజ దీని తర్వాత నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ఆ చిత్రంలో డిటెక్టివ్ తరహా పాత్రను రవితేజ పోషించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. 'చంటబ్బాయ్' సినిమాలో చిరంజీవి పోషించినటువంటి పాత్ర తరహాలో ఇది సాగుతుందట.
* విజయ్ సేతుపతి హీరోగా జననాథన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లాభం' చిత్రం షూటింగ్ మరికొంచం బ్యాలెన్స్ గా వుంది. ఈ లోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేయాలన్న ఉద్దేశంతో నిన్నటి నుంచి డబ్బింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి డబ్బింగ్ చెబుతున్నాడు. శ్రుతి హాసన్ ఇందులో కథానాయికగా నటిస్తోంది.