రామ్ గోపాల్ వర్మను అలా వదిలేయడమే మంచిది: ప్రకాశ్ రాజ్
- వర్మ చాలా విజ్ఞానవంతుడు
- ఆయనను అలా వదిలేయడం మంచిది
- పవన్ కల్యాణ్ రేంజ్ చాలా ఎక్కువ
వర్మ చాలా విజ్ఞానవంతుడని... ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చని అన్నారు. ఆయన అందిరిలాంటి మనిషి కాదని... అలాగని అందరూ అనుకుంటున్నట్టు చెడ్డ మనిషి కూడా కాదని చెప్పారు. ఆయనది ఒక విచిత్రమైన వ్యక్తిత్వమని అన్నారు. ఆయన తీసిన సినిమా మనకు నచ్చితే చూడొచ్చని, లేకపోతే వదిలేయొచ్చని చెప్పారు. తన సినిమా చూడమని వర్మ ఎవరినీ బలవంతం చేయడని అన్నారు.
పవన్ కల్యాణ్ గొప్పదనం ఏమిటో అందరికీ తెలుసని... వర్మ తప్పుగా చూపించినంత మాత్రాన పవన్ కు పోయేదేమీ లేదని ప్రకాశ్ రాజ్ చెప్పారు. పవన్ రేంజ్ చాలా ఎక్కువని అన్నారు. వర్మను అలా వదిలేయడమే మంచిదని అన్నారు. వర్మ తన లిమిట్స్ లో ఉంటాడని ఆశిస్తున్నానని చెప్పారు.