నటుడు కిక్ శ్యామ్ ను అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు
- అనుమతి లేకుండా గ్యాంబ్లింగ్ కార్యకలాపాలు
- శ్యామ్ సహా 14 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- కిక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్యామ్
కిక్ సినిమానే ఇంటిపేరుగా మార్చుకుని కిక్ శ్యామ్ గా ఫేమస్ అయిన ఈ నటుడికి చెన్నైలోని కోడంబాక్కం ప్రాంతంలో ఓ పోకర్ క్లబ్ ఉంది. అనుమతి లేకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు దాడులు నిర్వహించారు. క్లబ్ ముసుగులో గ్యాంబ్లింగ్ కు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కాగా, నుంగంబాక్కంలో నివసించే శ్యామ్, కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తన నివాసంలోనూ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.