సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- చిరంజీవితో తమన్నా ఐటెం పాట
- హీరోయిన్ గా రెహ్మాన్ కూతురు
- హిందీలోకి మరో తెలుగు సినిమా
* సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కూతురు రహీమా నటనారంగంలోకి ప్రవేశించనుంది. రెహ్మాన్ చిన్నమ్మాయి అయిన రహీమాకి ఇప్పటికే సంగీతంలో ప్రావీణ్యం వుంది. ఇటీవలే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి నివాళులర్పిస్తూ ఓ ఆల్బం కూడా విడుదల చేసింది. ఇక హీరోయిన్ కావాలని కలలు కంటున్న రహీమాను వచ్చే ఏడాది వెండితెరకు పరిచయం చేయడానికి రెహ్మాన్ ప్లాన్ చేస్తున్నాడట.
* మరో తెలుగు సినిమా హిందీలో రీమేక్ కానుంది. కీరవాణి తనయుడు సింహా హీరోగా రితేష్ రాణా దర్శకత్వంలో వచ్చిన 'మత్తువదలరా' చిత్రం తెలుగులో హిట్టయింది. ఇప్పుడీ క్రైం కామెడీ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.