కొత్తకథతో బన్నీని మెప్పించిన దర్శకుడు!
- బన్నీకి కథ చెప్పిన 'యాత్ర' దర్శకుడు
- పూర్తి స్క్రిప్ట్ తో రమ్మన్న బన్నీ
- 'పుష్ప' తర్వాత పట్టాలెక్కే అవకాశం
ఇటీవల దర్శకుడు మహి ఓ కథతో బన్నీని కలిశాడనీ, ఆయనకు కథ బాగా నచ్చిందనీ అంటున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాయింట్ కొత్తగా ఉండడంతో, పూర్తి స్క్రిప్టు తయారుచేసుకుని త్వరగా రమ్మని బన్నీ అతనికి చెప్పాడని సమాచారం. సో.. వీరి కాంబినేషన్ లో ఈ ప్రాజక్టు కార్యరూపం దాల్చే అవకాశం ఎక్కువగా వుందని అంటున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రాన్ని చేస్తున్నాడు. అది పూర్తయ్యాక మహి ప్రాజక్ట్ పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.