తన తల్లి గురించి దిల్ రాజు కుమార్తె భావోద్వేగం
- కొంత కాలం క్రితం తొలి భార్యను కోల్పోయిన దిల్ రాజు
- ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న రాజు
- ఈరోజు ఆయన భార్య జయంతి
మరోవైపు ఈ రోజు తన తల్లి జయంతి సందర్భంగా హన్షిత ఒక భావోద్వేగ పోస్టును పెట్టారు. 'పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా. నిన్న చాలా మిస్ అవుతున్నా. నీ జ్ఞాపకాలతోనే జీవిస్తున్నా. నీతో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నీతోనే నేను ఎక్కువ ఫొటోలు దిగాను. నీ దృష్టిలో ప్రేమ అంటే.. ఎప్పటిలాగానే నన్ను గట్టిగా కౌగిలించుకోవడం' అంటూ ఎమోషనల్ అయ్యారు. తన బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ అమ్మతో ఉన్న ఫొటోను షేర్ చేశారు.