సినిమాలకు బ్రహ్మానందం గుడ్‌బై.. ఇక బుల్లితెరకు హాస్యబ్రహ్మ?
- సినిమాలకు దూరంగా ఉండాలని బ్రహ్మీ నిర్ణయం
- ఇప్పటికే పలు కథలు వినిపించిన బుల్లితెర దర్శకులు
- త్వరలోనే టీవీ సీరియళ్లపై ప్రకటన?
బ్రహ్మానందం పాత్రకు ప్రత్యేకత ఉండేలా టీవీ దర్శకులు బ్రహ్మానందానికి ఇప్పటికే కొన్ని కథలు వినిపించారని, త్వరలోనే ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఈ విషయంలో ఆయన నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. అయితే, త్వరలోనే ఆయన ఈ విషయాన్ని ప్రకటించబోతున్నారని సమాచారం. బ్రహ్మానందం టీవీ సీరియళ్లలో నటించారంటే ఇక ప్రతీ ఇల్లు నవ్వులతో నిండిపోక తప్పదని ఆయన అభిమానులు అంటున్నారు.