వెబ్ సీరీస్ లో నటిస్తున్న ప్రముఖ నటుడు!
- బిజీ తారల్ని సైతం ఆకర్షిస్తున్న వెబ్ సీరీస్
- మంచి పాత్రలు, మంచి పారితోషికాల ఆఫర్
- ఓ వెబ్ సీరీస్ కి ఓకే చెప్పిన ప్రకాశ్ రాజ్
ఈ క్రమంలో ప్రముఖ క్యారెక్టర్ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా తొలిసారిగా వెబ్ సీరీస్ లో నటించడానికి రెడీ అయ్యారు. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్న వెబ్ సీరీస్ లో ప్రధాన పాత్ర పోషించడానికి ఆయన అంగీకరించారు. అంతేకాదు, దానికి స్క్రిప్టు కూడా ఆయనే సమకూరుస్తున్నారు. ఇటీవలి కాలంలో దేశంలోని పలుచోట్ల చోటుచేసుకున్న కొన్ని వాస్తవ సంఘటనలతో ఈ వెబ్ సీరీస్ రూపొందుతోందని తెలుస్తోంది.