ఓటీటీ ద్వారా యాక్షన్ హీరో సినిమా విడుదల
- నిర్మాతలకు మరో ప్రత్యామ్నాయంగా ఓటీటీ
- గోపీచంద్ హీరోగా 'ఆరడుగుల బుల్లెట్'
- మూడేళ్ల నుంచి వాయిదా పడుతున్న వైనం
- నయనతార హీరోయిన్ గా నటించిన సినిమా
ఈ క్రమంలో తాజాగా యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన 'ఆరడుగుల బుల్లెట్' చిత్రం కూడా త్వరలో ఓటీటీ ద్వారా విడుదల కానుందని తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఈ చిత్రం రూపొంది మూడేళ్లయింది. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రం విడుదల ఫైనాన్షియల్ సమస్యల వల్ల రెండు మూడు సార్లు వాయిదా పడి.. ప్రాజక్టు స్టేల్ అయిపోయింది. ఇప్పుడు ఓ ఓటీటీ సంస్థ నుంచి మంచి ఆఫర్ రావడంతో నిర్మాతలు కమిట్ అవుతున్నట్టు సమాచారం. త్వరలోనే రిలీజ్ డేట్ తో కూడిన వివరాలను ప్రకటిస్తారు.