కోఠి ఆసుపత్రి నుంచి కరోనా రోగి పరార్.. తొర్రూరులో పట్టేసిన పోలీసులు
- రెండు బస్సుల్లో ప్రయాణించి తొర్రూరుకు చేరుకున్న రోగి
- బాధితుడి సోదరుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు, వైద్యాధికారులు
- వరంగల్ ఎంజీఎంకు తరలింపు
దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన వైద్యులు, పోలీసులకు సమాచారం అందించాడు. ఆ వెంటనే డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కోట చలం, ఎస్సై నగేశ్, ఇతర సిబ్బంది తొర్రూరు బస్టాండుకు చేరుకుని బాధితుడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ అతడికి పీపీఈ కిట్ తొడిగిన అనంతరం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం, అతడు ఏ బస్సులో ఎక్కాడు? అందులో ఎందరు ప్రయాణించారన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.