సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య మాటలకందని వేదన కలిగించింది: మహేశ్ బాబు
- బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య
- దిగ్భ్రాంతికి గురయ్యానన్న మహేశ్ బాబు
- చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరమంటూ ట్వీట్
ఈ అంశంపై స్పందిస్తూ టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అకాల మరణం గురించి తెలుసుకున్న తర్వాత మాటలకందని వేదన కలిగిందని, షాక్ కు గురయ్యానని వెల్లడించారు. పొంగిపొర్లే ప్రతిభకు నిదర్శనం లాంటి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చాలా చిన్నవయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లాడని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో సుశాంత్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని వెల్లడించారు.