ఆద్యంతం ఉత్కంఠభరితంగా 'పెంగ్విన్' ట్రైలర్.. విడుదల చేసిన నాని
- కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'పెంగ్విన్'
- ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో సినిమా
- తప్పిపోయిన కుమారుడిని వెతికే పాత్రలో కీర్తి
తప్పిపోయిన కుమారుడిని వెతికే పాత్రలో కీర్తి సురేశ్ నటించింది. మరోపక్క అతడి కోసం పోలీసులు కూడా అడవిలో వెతుకుతున్నట్లుగా ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్ చివరిలో ఓ సైకో ఎవరినో నరుకుతూ కనపడతాడు.
ఈ సినిమాను 'పేట' సినిమా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మించారు. ఇటీవలే విడుదలైన ‘పెంగ్విన్’ టీజర్, ఫస్ట్ లుక్‌లకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 19న అమెజాన్ ప్రైమ్ ద్వారా దీనిని విడుదల చేస్తున్నారు.