ఆ హ్యాష్ ట్యాగ్ ఉపయోగించినందుకు క్షమించండి: హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక
- ప్రపంచవ్యాప్తంగా కదలిక తెచ్చిన జార్జ్ ఫ్లాయిడ్ మరణం
- అత్యంత ప్రజాదరణ పొందిన 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' హ్యాష్ ట్యాగ్
- దీనికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన 'ఆల్ లైవ్స్ మ్యాటర్' హ్యాష్ ట్యాగ్
- 'ఆల్ లైవ్స్ మ్యాటర్' హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించిన శివాత్మిక
అయితే ఇందులో 'ఆల్ లైవ్స్ మ్యాటర్' అనే హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగిస్తూ టాలీవుడ్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఓ పోస్టు చేసింది. దీనిపై తన తప్పు తెలుసుకున్న శివాత్మిక వెంటనే స్పందించి క్షమాపణలు కోరింది. 'ఆల్ లైవ్స్ మ్యాటర్' అనే హ్యాష్ ట్యాగ్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమాన్ని వ్యతిరేకంగా వాడుతున్నారని, అయితే ఆ హ్యాష్ ట్యాగ్ ను తాను వాడడం పట్ల క్షమాపణలు తెలియజేస్తున్నానని, అది ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదని శివాత్మిక వివరణ ఇచ్చింది.