సి.కల్యాణ్ పై నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా: 'మా' అధ్యక్షుడు నరేశ్
- సి.కల్యాణ్ వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరమంటూ ఇంతక్రితం నరేశ్ ట్వీట్
- నరేశ్ కు ఫోన్ చేసి మాట్లాడిన సి.కల్యాణ్
- కల్యాణ్ తనకు వివరణ ఇచ్చారన్న నరేశ్
'మా'కు సమాచారం ఇవ్వకపోవడం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, సమాచార ప్రసార లోపంతోనే ఈ పొరబాటు జరిగి ఉంటుందని కల్యాణ్ తనతో చెప్పారని నరేశ్ వివరించారు. అందుకే కల్యాణ్ పై ఇంతక్రితం చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా నుంచి తొలగిస్తున్నానని చెప్పారు. టాలీవుడ్ లో శాంతియుత, స్నేహపూర్వక వాతావరణాన్ని కోరుకుంటున్నానని, దానికోసమే పాటుపడతానని నరేశ్ ఉద్ఘాటించారు.