త్రిష వివాదాస్పద పోస్ట్.. రానా గురించేనంటూ చర్చ!
- కామెంట్లు రావడంతో పోస్ట్‌ను డిలీట్ చేసిన త్రిష
- అప్పటికే స్క్రీన్ షాట్లు తీసిపెట్టుకున్న నెటిజన్లు
- ఇటీవలే రానాకు కుదిరిన పెళ్లి

ఎవరైతే తమ మాజీ ప్రియురాళ్లను స్నేహితులుగా కొనసాగిస్తారో వారు అహంకారులని ఓ పరిశోధనలో తేలిందంటూ వచ్చిన వార్తను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ విషయం తనకు ముందే తెలుసని ఆమె కామెంట్ చేసింది. ఆమె రానా గురించే ఈ కామెంట్ చేసిందంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. దీంతో ఆమె ఈ పోస్ట్ ను డిలీట్ చేసింది. అప్పటికే కొందరు ఆమె చేసిన వ్యాఖ్యను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారు.