పూరి దర్శకత్వంలో బాలయ్య సినిమా.. స్క్రిప్టు రెడీ!
- గతంలో బాలకృష్ణతో పూరి 'పైసా వసూల్'
- కేన్సిల్ అయిన బి.గోపాల్ తో ప్రాజక్ట్
- పూరి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన బాలయ్య
- బోయపాటి సినిమా తర్వాత ఇదే సెట్స్ కు
ఇక, ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగు ఆగింది. త్వరలోనే షూటింగులు పునః ప్రారంభం కాగానే, బోయపాటి కూడా ఈ సినిమా షూటింగును మొదలెడతారు. ఆ చిత్రం తర్వాత ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తారంటూ నిన్నటి వరకు వార్తలొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఆ ప్రాజక్టు కేన్సిల్ అయిందట. ఆ స్థానంలోనే పూరి జగన్నాథ్ తో చేసే సినిమా ఉంటుందని అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.