కరెన్సీ నోట్ల మీద వీరి చిత్రాలను కూడా చూడాలని ఉంది: నాగబాబు వ్యాఖ్యలు
- కరెన్సీ నోట్ల మీద బోస్, అంబేద్కర్, భగత్ సింగ్ చిత్రాలు ముద్రించాలి
- మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ
- మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు
- నోట్లపై వారి ముఖ పరిచయం చేయాల్సిన బాధ్యత ఉంది
'గాంధీ గారు బతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు. భావితరాలకు కరెన్సీ నోట్లపై వారి ముఖ పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది' అని నాగబాబు అన్నారు.