మంచు మనోజ్ మంచి మనసు.. వలస కార్మికుల కోసం బస్సుల ఏర్పాటు
- వలస కార్మికుల కోసం బస్సుల ఏర్పాటు
- అనుమతించిన కేంద్రం
- అందరి సాయం అవసరమన్న మనోజ్
వలస కార్మికులను ఇళ్లకు పంపేందుకు బస్సులు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నానని, అనుమతి కావాలని కేంద్రాన్ని కోరగా, అనుమతించిందని మనోజ్ తెలిపారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళంకు రెండు బస్సులు బయలుదేరినట్టు మనోజ్ పేర్కొన్నారు. కార్మికులకు ఆహారం, మాస్కులు, శానిటైజర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మున్ముందు ఈ సేవలను మరింత విస్తరించనున్నట్టు తెలిపారు.
కాగా, మనోజ్ ఈ రోజు తన బర్త్ డే జరుపుకుంటున్నారు. 2017లో చివరిసారి ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాలో నటించిన మనోజ్.. మూడేళ్ల విరామం తర్వాత ప్రస్తుతం ‘అహం బ్రహ్మస్మి’ సినిమాలో నటిస్తున్నారు.