హిమాలయాల్లోను షూటింగు చేయనున్న బోయపాటి?
- బాలయ్యతో బోయపాటి మూడో సినిమా
- కవల సోదరులుగా కనిపించనున్న బాలకృష్ణ
- రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లు
వారణాసిలో అఘోరాగా కనిపించే పాత్ర తాలూకు సన్నివేశాలు కొన్ని హిమాలయాల్లోను చిత్రీకరించనున్నారట. అందువలన పరిస్థితులు కుదురుకున్నాక అక్కడ ఈ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఇక రాయలసీమకి చెందిన పాత్రకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇతర దేశాల్లో చిత్రీకరించవలసివుంది. ఇప్పట్లో అంతటి రిస్క్ చేయడం కరెక్ట్ కాదని భావించిన బోయపాటి, హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ వేయించనున్నాడట. లాక్ డౌన్ పూర్తికాగానే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా ద్వారా బోయపాటి ఒక కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే.