'బిగ్ బాస్ 4' కోసం అనసూయతో సంప్రదింపులు
- అనసూయకి యూత్ లో విపరీతమైన క్రేజ్
- 'బిగ్ బాస్ 4' నుంచి భారీ ఆఫర్
- ఆసక్తిని చూపని అనసూయ
గత సీజన్లో యాంకర్ శ్రీముఖిని ఎంపిక చేసుకున్న నిర్వాహకులు ఆమెకి ఎపిసోడ్ కి లక్ష రూపాయలను చెల్లించినట్టుగా చెప్పుకున్నారు. ఆ లెక్కన చూసుకుంటే అనసూయకు అంతకంటే ఎక్కువనే ఇవ్వవలసి ఉంటుంది. అందువలన షో నిర్వాహకులు భారీ మొత్తమే ఆఫర్ చేశారట. అయినా అనసూయ ఆసక్తిని చూపలేదని అంటున్నారు. అంతకాలం పాటు తాను ఫ్యామిలీకి దూరంగా ఉండలేనని ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందని చెబుతున్నారు. ఇక ఒక వైపున టీవీ షోలతోను .. మరో వైపున సినిమాలతోను అనసూయ బిజీగా ఉండటం కూడా ఆమె 'నో' చెప్పడానికి కారణమని అనుకుంటున్నారు.