బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ విలన్
- బాలకృష్ణతో బోయపాటి మూడో మూవీ
- ప్రతినాయకుడిగా శ్రీకాంత్
- అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు
దాంతో ఈ సినిమాలో శ్రీకాంత్ మెయిన్ విలన్ గా అనుకున్నారు. కానీ శ్రీకాంత్ కాకుండా మరో విలన్ కూడా ఉంటాడట. ఆ విలన్ ను బాలీవుడ్ నుంచి రంగంలోకి దింపనున్నట్టుగా తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న బాలీవుడ్ ఆర్టిస్టును తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారట. బాలకృష్ణకి .. బాలీవుడ్ విలన్ కి మధ్య భారీ యాక్షన్ సీన్స్ .. చేజింగ్స్ వుంటాయని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. 'సింహా' .. 'లెజెండ్' వంటి భారీ విజయాల తరువాత బోయపాటి - బాలయ్యల కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.