కృష్ణవంశీ నన్ను ఒక రేంజ్ లో తిట్టేవాడు: నటుడు ఆదర్శ్ బాలకృష్ణ
- కృష్ణవంశీతో ఆ సినిమా చేశాను
- నాకు నటన రాదని అవమాన పరిచారు
- ఇప్పుడు స్నేహం కుదిరిందన్న ఆదర్శ్
'నీకు నటన రాదు .. నువ్వెందుకు పనికి రావు' అంటూ ఆయన ఒక రేంజ్ లో తిట్టేవారు. ఆ మాటలు చాలా అవమానకరంగా అనిపించినప్పటికీ, చాలా సహనంతో భరిస్తూ వచ్చేవాడిని. నా నుంచి మంచి నటనను రాబట్టడం కోసమే ఆయన అలా అంటున్నారని భావించాను. షూటింగు జరుగుతున్నప్పుడుగానీ .. ఆ తరువాతగాని ఆయనపై నాకు కోపం రాలేదు. ఇప్పుడు ఆయనతో మంచి స్నేహం కుదిరింది. కలిసినప్పుడల్లా సరదాగా మాట్లాడుకుంటాము. ఆయన నన్ను తిట్టిన తిట్లను నేను గుర్తుచేస్తుంటే, నాతో పాటు కలిసి ఆయన నవ్వుతుంటారు" అని చెప్పుకొచ్చాడు.