రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన దిల్ రాజుకు ఆల్ ది బెస్ట్ చెప్పిన బండ్ల గణేశ్
- ఈ రోజు రాత్రి దిల్ రాజు వివాహం
- దిల్ రాజు చేసిన ప్రకటనను పోస్ట్ చేసిన బండ్ల గణేశ్
- దేవుడు ఎల్లప్పుడూ దిల్ రాజును దీవిస్తూనే ఉంటాడని వ్యాఖ్య
కాగా, కొన్ని గంటల క్రితం దిల్ రాజు ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు కార్యకలాపాలు నిలిచిపోయాయని చెప్పారు. చాలా మంది కూడా వృత్తిపరంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, వ్యక్తిగతంగా తన జీవితం ఇప్పుడు అంతా గొప్పగా లేదని చెప్పారు. కానీ త్వరలోనే ఈ పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నానని, ఈ ఆశతోనే తాను కొత్త జీవితం ప్రారంభించడానికి తనకు సమయం వచ్చిందని భావిస్తున్నానని చెప్పారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటున్నట్టు తన పోస్ట్ లో పేర్కొన్నారు.