'ఆకాశవాణి' చిత్రం నుంచి తప్పుకోవడానికి గల కారణాలు వివరించిన ఎస్ఎస్ కార్తికేయ
- అశ్విన్ గంగరాజు చిత్రంలో ఆకాశవాణి చిత్రం
- నిర్మాతగా వ్యవహరించిన రాజమౌళి తనయుడు కార్తికేయ
- సృజనాత్మక అంశాల్లో తేడాలు వచ్చాయని కార్తికేయ వివరణ
ఇకపై ఆకాశవాణి నిర్మాణ బాధ్యతలను ఏయూ అండ్ ఐ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఎ.పద్మనాభరెడ్డికి అప్పగిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాదు, దర్శకుడికి తనకు మధ్య కొన్ని సృజనాత్మక అంశాల్లో విభేదాలు వచ్చాయని, మరొకరి ఆలోచనలైతే చిత్ర నిర్మాణానికి మరింతగా ఉపకరించవచ్చేమోనని భావించి కూడా ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్టు కార్తికేయ వివరణ ఇచ్చారు.